తన వ్యతిరేకులను ఎలా ఉడికిస్తోందో చూశారా..?
విధాత: అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకి తెలుగులో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. అటు బుల్లితెర వీక్షకుల నుంచి వెండితెర ప్రేక్షకుల వరకు ఈ పేరు అందరి నోళ్లలోనూ నానుతోంది. అనసూయ.. తెలుగు నటనారంగంలో అంటే బుల్లితెర కం వెండితెరపై ఓ ఫైర్ బ్రాండ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా ఆంటీ అయినా కూడా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో ఆమె తీవ్ర స్థాయిలో ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంటుంది. అయితే వాటిని ఆమె పట్టించు కోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. నటిగా 2003లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాగ’తో పరిచయం అయిన అనసూయ.. ఆ తర్వాత అటువంటి పలు చిత్రాల్లో నటించింది. నటిగా ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చింది మాత్రం రంగస్థలంలోని రంగమ్మత్త పాత్ర అని చెప్పాలి. అలా చెప్పుకుంటే బుల్లితెర పరంగా జబర్దస్త్ కు ముందు తర్వాత… అలాగే సినిమాల పరంగా రంగస్థలంకు ముందు తర్వాత అని విభజించుకోవచ్చు. ఇక ఈమె సినీ కార్యక్రమాలు, టెలివిజన్ షోలు, వెండితెర పాత్రలతో రెండు చేతులా బాగా సంపాదిస్తోంది.
ఇక వ్యక్తిగత జీవితంలో కూడా ఈమె ఓ ఫైర్ బ్రాండ్. ఎందుకంటే విజయ్ దేవరకొండ వంటి మరో తనదైన యాటిట్యూడ్ కలిగిన స్టార్‌తో ఆమె సై అంటే సై అంటూ యుద్ధానికి దిగింది. ‘అర్జున్’ రెడ్డి మూవీలో కొన్ని సీన్స్, బూతులపై అనసూయ అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యూస్ చానల్స్ డిబేట్స్‌లో పాల్గొని వాదించింది. ఆ వివాదం అప్పుడు ముగియగా.. దాన్ని అంతటితో వదిలిపెట్టకుండా ‘లైగర్’ చిత్రం ఫ్లాప్ సమయంలో మొదటి రోజునే మళ్లీ కెలికింది.
లైగర్ డిజాస్టర్‌ను ఉద్దేశించి ఆమె పరోక్షంగా అమ్మను తిట్టిన పాపం ఊరికే పోదు. ఇలా వెంటాడింది. ఉసురు ఊరికే పోదు. అమ్మని అన్న ఉసురు అసలు ఊరకే పోదు. కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అంటూ రాసుకు వచ్చింది. దీనికి తోడు ఆమె ఇతరుల బాధను చూసి ఆనందపడను కానీ కర్మ అనేది తిరిగి వస్తుంది అని పేర్కొంది. ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిందని అర్జున్ రెడ్డిలో తల్లిపై విజయ్ చేసిన కామెంట్స్‌ను గుర్తుచేస్తూ లైగర్‌ను ఉద్దేశించి చేసిందని అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు.
అలాగే సోషల్ మీడియా వేధింపులపై అనసూయ కొందరిపై సైబర్ విభాగంలో కంప్లైంట్ చేసింది. ఇటీవల కూడా తనను ట్రోల్ చేసిన వ్యక్తిని కటకటాల వెనక్కు పంపించింది. అనసూయతో పాటు రష్మీ గౌతమ్, ప్రగతి, విష్ణుప్రియ, శ్రీముఖిలపై అసభ్యకర సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్న సదరు వ్యక్తిపై కంప్లైంట్ చేయడంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేయిస్తున్నా.. అనసూయను ట్రోల్ చేయడం ఆగడం లేదు. అదే సమయంలో ఆమె కూడా తగ్గడం లేదు. ఈమధ్య అనసూయ సోషల్ మీడియాలో ఓ రేంజిలో తన యాటిట్యూడ్ చూపుతోంది. తన లగ్జరీ, హ్యాపీ లైఫ్‌ను సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తోంది. ఆమె వైభవం చూసి ఆమె వ్యతిరేకులు కుళ్ళుకోవాలని అనసూయ భావిస్తుంది. తాజాగా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకున్న ఫోటోలతో ఆమె కనిపించింది.
ఫైవ్ స్టార్ హోటల్‌లో వైన్ తాగుతూ డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో పంచుకుంది. అనసూయ వైన్ గ్లాస్‌తో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ఫోటోలు చూసిన కొందరు అనసూయకు ఈ వ్యసనం కూడా ఉందా? అని వాపోతున్నారు. హై సొసైటీలో వైన్ తాగుతూ భోజనం చేయడం కల్చర్‌గా భావిస్తారు. దానిని వ్యసనం కింద చూడరు.
కాగా అనసూయ కెరీర్ ప్రస్తుతం మూడు వెబ్‌సిరీస్‌లు… ఆరు సినిమా వేషాలుగా ఉంది. విరివిగా సినిమా అవకాశాలు వస్తూ ఉండడంతో బుల్లితెరను కూడా దాదాపు వదిలేసింది. జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పిన విషయం ఆల్రెడీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె పూర్తిగా బుల్లితెరకు దూరమయ్యారు. పుష్ఫ2, రంగమార్తాండ చిత్రాలతో పాటు రెండు మూడు వెబ్ సిరీస్‌లలో అనసూయ నటిస్తోంది.