సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కవి, రచయితలు కళాకారులు.. సన్మానించిన సీఎం

సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం పలువురు ప్రముఖ కవులు, రచయితలు, కళకారులు మర్యాదపూర్వకంగా కలిశారు

  • Publish Date - March 24, 2024 / 10:44 AM IST

విధాత, హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం పలువురు ప్రముఖ కవులు, రచయితలు, కళకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ దంపతులను సన్మానించారు. అలాగే ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీతలు అందె భాస్కర్( డప్పు వాయిద్యం), పెరణి రాజ్ కుమార్ నాయక్ ( పేరిణి నృత్యం)లను సీఎం సన్మానించారు. అనంతరం ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశోక్ తేజ పలు పుస్తకాలను రేవంత్‌రెడ్డికి బహుకరించారు.