విధాత: అన్నారం పంప్ హౌజ్ మొదటి పంపును ఇంజినీర్లు ఈ రోజు జయప్రదంగా నడిపించారు. పంప్ designed dischargeను ఎత్తి పోసిందని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఎత్తిపోతల సలహాదారు పెంటా రెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. పంపు పనితీరుపై పూర్తి సంప్ప్‌హౌజ్‌లో కూడా పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. అక్కడి పంపులను కూడా అక్టోబర్ చివరి నాటికి నడిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వం అసెంబ్లీలో ప్రజలకు ఇచ్చినమాట ప్రకారం అన్నారం పంప్ హౌజ్‌లో మొదటి పంపును జయప్రదంగా నడిపామని ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ అన్నారు. ఈ కృషిలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కూడా ఈ విజయంపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇంజినీర్లకు అభినందనలు తెలియజేశారు.
అనుకున్న ప్రకారం రెండు నెలల కాలంలోనే అన్నారం పంప్ హౌజ్ పునరుద్ధరణ జరిపినందుకు సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేసి.. సలహాదారు పెంటారెడ్డి, ENC వెంకటేశ్వర్లును అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగతా పంపులను కూడా నడిపించాలని కోరారు. అన్నారం పంపుల పునరుద్దరణ ప్రక్రియ జయప్రదం అయినందుకు ఆర్థిక మంత్రి హశ్‌రావు హర్షం వెలిబుచ్చారు. ఇంజినీర్లకు అభినందనలు తెలిపారు.