విధాత: మిర్యాలగూడ కేఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కామర్స్ సబ్జెక్టుకు సంబంధించి ఖాళీగా ఉన్న ఒక అతిధి ఆధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ టి.వెంకటరమణ తెలియజేశారు.
సంబంధిత సబ్జెక్టుల్లో పీజీలో55 శాతం, ఎస్సీ ఎస్టీలు 50 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. నెట్ సెట్ పీహెచ్‌డీలతో పాటు బోధనా అనుభవం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఆసక్తిగలవారు వచ్చే నెల 03-11-2022 వ తేదీ సాయంత్రం 4:30గంటలలోపు కేఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇంటర్వ్యూ తేదీలు దరఖాస్తులు చేసిన అభ్యర్థులకు తెలియజేస్తామని తెలిపారు.