మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ భయపడుతున్నదని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు k.లక్ష్మణ్ అన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌పై వ్యతిరేకత వ్యక్తమైంది. మునుగోడులో మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు మకాం వేశారు. టీఆర్ఎస్ కులాలు, గ్రామాల వారీగా మద్యం, డబ్బులు పంచుతున్నదని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడారు. మునుగోడులో లబ్ధి పొందేందుకే గిరిజన బంధు ప్రకటించారు. బీసీ ఫెడరేషన్, కార్పొరేషన్లకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఓటమి భయంతోనే కేసీఆర్ కమ్యూనిస్టులతో జత కట్టారు. తోక పార్టీలంటూ విమర్శించిన కమ్యూనిస్టులతో ఇప్పుడు జత కట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటేనే అభివృద్ధి జరుగుతుందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసేందుకు పనికిరారా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు.