విధాత: భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. తవాంగ్ జిల్లాలో చైనాకు సరిహద్దుకు సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
రోజువారీ విధుల్లో భాగంగా ఫార్వర్డ్ ఏరియాలో చక్కర్లు కొడుతుండగా ఈ సంఘటన జరిగింది. ఇరువురు పైలట్లను సైనిక బృందాలు సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందగా..తీవ్రంగా గాయపడిన మరో పైలట్‌కు చికిత్స కొనసాగుతున్నది.