PAWAN KALYAN ఉన్నమాట: తాను విఫలమైన పొలిటీషియన్.. కానీ ఎప్పుడూ ఓడి పోయినట్లు బాధ పడలేదు. అపజయం కూడా సగం విజయంతో సమానమనే భావన నింపుకున్నాను. నేను కనీసం ప్రయత్నం చేశానని అనుకుంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు.
ప్రజారాజ్యంతో మొదలైన తన రాజకీయ ప్రస్థానం జనసేన అధ్యక్షుడైనా తన కంటూ సొంత అజెండా ఏమీ లేదు. చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ జగన్ పాదయాత్ర చేశాడు. తనకు అవకాశమిస్తే ఏమీ చేస్తానో ప్రజలకు వివరించాడు. ప్రజలు ఆదరించారు. టీడీపీ కంచుకోటలు బద్దలు కొట్టి సీఎం అయ్యాడు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తర్వాత జన సేనకు ప్రజల్లో ఆదరణ ఉన్నది.
అటు బీజేపీ, ఇటు టీడీపీలకు దూరంగా ఉండి జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ. స్థిరంగా ఉండి ఉంటే వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉండేది. కానీ ఏపీకి ఇచ్చిన విభజన హామీలను కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. దీన్ని గట్టిగా ప్రశ్నించకుండా.. టీడీపీకి బీ టీమ్‌గా పని చేస్తున్నారనే జనసేన అధినేతపై ప్రత్యర్థి పార్టీల ఆరోపణలను ఆయనే అనేక సందర్భాల్లో నిజం చేశారు.
When it comes to politics , I am a failed politician.. I never felt bad about it..A failure is half way to success