విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం గద్దరాళ్ల తండా లో ఓ కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై తాండ వాసులు దాడికి పాల్పడటం వివాదాస్పదమైంది.
ఉద్దేమర్రి వైన్స్ లో తుపాకీ చూపించి 2 లక్షలు చోరీ చేసిన ఘటన లో తండా కు చెందిన వ్యక్తిని విచారిచేందుకు అర్ధరాత్రి వెళ్లిన అల్వాల్ ఎస్ఐ , షామీర్ పేట ఎస్ఐ, డిటెక్టివ్ సిఐ , కానిస్టేబుల్స్ పైన తాండ వాసులు దాడి చేశారు.
విచారణకు వెళ్ళిన పోలీసులు ప్రైవేట్ కారులో వెళ్లడంతో వారిని నకిలీ పోలీసులుగా భావించి తండావాసులు వారిపై దాడికి పాల్పడ్డారు సమాచారం అందుకున్న భువనగిరి ఏసీపీ సిబ్బందితో హుటాహుటిన వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులను బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.