Site icon vidhaatha

పార్టీ మారట్లేదు.. నాపై దుష్ప్రచారం: పుట్ట మధు

విధాత: మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పార్టీ మారనున్నారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్నది. అలాగే బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లినట్టు బీజేపీ అధిష్ఠాన పెద్దలను కలిసినట్టు వార్తలు వచ్చాయి.

అయితే దీనిపై స్పందించిన ఆయన తాను పార్టీ మారుతున్నానని వస్తున్నవదంతులను ఖండించారు. కొంతమంది కావాలనే ఇలాంటి దుష్ఫ్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరాల్సిన తనకు లేదన్నారు.

కిందిస్థాయి నుంచి వచ్చిన తనను గుర్తించి సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. మంథని నియోజకవర్గంలో తనకు పోటీయే లేదని భారీ మెజారిటీతో తాను గెలుస్తానని మధు ధీమా వ్యక్తం చేశారు.

నాయకులు సొంత పనుల మీద ఢిల్లీకి వస్తే పార్టీ మారుతున్నారంటూ వారి ప్రతిష్ఠ దిగజార్చేలా పుకార్లు పుట్టిస్తున్నారని.. ఇవి చూస్తుంటే అసలు అక్కడికి వెళ్లాలంటేనే భయం కలుగుతున్నదన్నారు.

Exit mobile version