Site icon vidhaatha

అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం: విజయలక్ష్మి

విధాత‌, హైద‌రాబాద్‌: వార‌స‌త్వ రాజకీయ రంగ ప్రవేశంపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు ‘అలయ్ బలయ్’ ఫౌండర్ చైర్ పర్సన్‌ బండారు విజయలక్ష్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. పార్టీకి పనికొస్తానని భావిస్తే.. వారు నా సేవలను వారు తప్పకుండా వినియోగించుకుంటారని తెలిపారు.

బీజేపీలో ఒక ఏరియా అనుకొని పని చేయమని, పార్టీ కోసం పనిచేస్తామని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం అనే కాదు.. ఎక్కడి నుంచైనా పార్టీ అవకాశం ఇవ్వొచ్చని బీజేపీ చెప్పిన ప్రకారం నడుచుకుంటానని తెలిపారు. రాజకీయాల్లో తనకు అవకాశం కల్పించే అంశంపై తుది నిర్ణయం బీజేపీదేనని స్పష్టం చేశారు.

ప్రతిసారిలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ సంస్కృతిని అందరికి గుర్తు చేసేందుకు అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించాం. ఈసారి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నం. రుచికరమైన వంటకాలను తయారు చేయించాం అని తెలిపారు. గవర్నర్ తమిళిసైకి ఇతరత్రా కార్యక్రమాలు ఉండటంతో ఈరోజు అలయ్ బలయ్‌కు రాలేకపోయారని స్పష్టం చేశారు.

Exit mobile version