విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అంటే నటుడు, కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్‌కు ఎంత ఇష్టమో.. ఎంత ప్రాణమో మరోసారి సోషల్ మీడియా వేదికగా తెలిసేలా చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ అంటూ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ యాత్రలో రాహుల్ గాంధీకి చెమటలు పడితే.. తనకు చెమటలు పట్టినట్లుగా బండ్లన్న ఫీలైపోతున్నాడు. ఈ మధ్య రాజకీయాలకు ఇక దూరం అని ప్రకటించిన బండ్ల గణేష్.. ఈ యాత్రను చూసి మరోసారి యాక్టివ్ అవుతున్నాడా? అనిపించేలా ఆయన ట్వీట్స్ ఉన్నాయి.
నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….2
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022
దీంతో అందరూ ఆయన మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడా? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆయన అటెంట్ అయ్యే ప్రతి ఇంటర్వ్యూలో.. రాజకీయాలకు సంబంధించి బండ్లకు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
…..అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..