Site icon vidhaatha

Bank Holidays in February | ఫిబ్రవరిలో 11 రోజులు బ్యాంకుల మూసివేత..!

Bank Holidays in February | ఫిబ్రవరిలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్‌బీఐ ఈ మేరకు బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 11 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేలతో పాటు యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేస్తాయి.


డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు వీలుంటుంది. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్‌ డిపాజిట్ల కోసం మెషిన్లను సైతం అందుబాటులో ఉండగా.. వీటితో అకౌంట్‌లో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలు కలుగుతుంది.


ఫిబ్రవరిలో సెలవులు ఇలా..

4న ఆదివారం సెలవు.

10న రెండో శనివారం సెలవు. లోసార్ పండుగ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో సెలవు.

11న ఆదివారం సెలవు.

14న వసంత పంచమి సందర్భంగా అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్యాంకుల మూసివేత.

15న లుయ్ నాగాయ్‌ని పండుగ నేపథ్యంలో మణిపూర్‌లో బ్యాంకులు మూసివేత.

18న ఆదివారం సెలవు.

19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబయి, నాగ్‌పూర్‌లో సెలవు.

20న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాంలో సెలవు.

24న నాల్గో శనివారం బ్యాంకులు క్లోజ్‌.

25న ఆదివారం సెలవు.

26న న్యోకుమ్‌ కారణంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో బ్యాంకుల మూసివేత.

Exit mobile version