మార్చి నెల‌లో బ్యాంకుల‌కు 14 రోజులు సెల‌వులు..!

నేటితో ఫిబ్ర‌వరి నెల ముగియ‌నుంది. రేపటి నుంచి మార్చి నెల ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి మార్చి 31వ తేదీ వ‌ర‌కు బ్యాంకుల‌కు 14 రోజులు సెల‌వులు రానున్నాయి

  • Publish Date - February 29, 2024 / 09:42 AM IST

న్యూఢిల్లీ : నేటితో ఫిబ్ర‌వరి నెల ముగియ‌నుంది. రేపటి నుంచి మార్చి నెల ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి మార్చి 31వ తేదీ వ‌ర‌కు బ్యాంకుల‌కు 14 రోజులు సెల‌వులు రానున్నాయి. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ డిజిట‌ల్ పేమెంట్స్ చేస్తున్న‌ప్ప‌టికీ, కొంత‌మంది ఖాతాదారులు బ్యాంకుల‌కు త‌ప్ప‌నిస‌రిగా వెళ్తున్న ప‌రిస్థితి ఉంది. అలాంటి ముందే సెల‌వుల‌ను గ‌మ‌నించుకొని, బ్యాంకు ప‌నుల‌ను చూసుకోవ‌డం మంచిది. మార్చి నెల‌లో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు మరో ఏడు రోజులు బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.


బ్యాంకుల‌కు సెల‌వులు ఎప్పుడెప్పుడంటే..?


మార్చి 1 – మిజోరంలో చాప్ చార్ కుట్ సందర్భంగా బ్యాంకులకు సెలవు

మార్చి 3 – ఆదివారం

మార్చి 8 – మహా శివరాత్రి సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా సెలవు

మార్చి 9 – రెండో శనివారం

మార్చి 10 – ఆదివారం

మార్చి 17 – ఆదివారం

మార్చి 22 – బీహార్ దివస్ సందర్భంగా బీహార్ లో బ్యాంకులు పని చేయవు.

మార్చి 23 – నాలుగో శనివారం

మార్చి 25 – హోలీ సందర్భంగా కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా దేశమంతా సెలవు

మార్చి 26 – హోలీ రెండో రోజు సందర్భంగా ఒడిశా, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు

మార్చి 27 – హోలీ సందర్భంగా బీహార్ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

మార్చి 20 – గుడ్ ఫ్రైడే సందర్భంగా త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

Latest News