Bengaluru | 45 నిమిషాల జ‌ర్నీకి.. 225 నిమిషాల నిరీక్ష‌ణ‌..!

Bengaluru | ప్ర‌ధాన న‌గ‌రాల్లో ట్రాఫిక్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ర‌ద్దీగా ఉన్న స‌మ‌యంలో రోడ్ల‌పైనే గంట‌ల త‌ర‌బ‌డి ఉండిపోవాల్సి వ‌స్తుంది. ర్యాపిడో, ఉబెర్, ఓలా వంటి రైడ్స్‌ను బుక్ చేసుకున్నా.. ఆ ట్రాఫిక్‌లో మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేందుకు చాలా స‌మ‌యం ప‌డుతోంది. అయితే ఓ వ్యక్తి బెంగ‌ళూరులో ట్రాఫిక్ క‌ష్టాల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. ఇటీవ‌లే బెంగ‌ళూరులో ప‌ర్య‌టిస్తున్న ఓ వ్య‌క్తి.. తాను వెళ్లాల్సిన గ‌మ్య‌స్థానానికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అత‌ను […]

  • Publish Date - August 2, 2023 / 02:27 AM IST

Bengaluru | ప్ర‌ధాన న‌గ‌రాల్లో ట్రాఫిక్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ర‌ద్దీగా ఉన్న స‌మ‌యంలో రోడ్ల‌పైనే గంట‌ల త‌ర‌బ‌డి ఉండిపోవాల్సి వ‌స్తుంది. ర్యాపిడో, ఉబెర్, ఓలా వంటి రైడ్స్‌ను బుక్ చేసుకున్నా.. ఆ ట్రాఫిక్‌లో మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేందుకు చాలా స‌మ‌యం ప‌డుతోంది. అయితే ఓ వ్యక్తి బెంగ‌ళూరులో ట్రాఫిక్ క‌ష్టాల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు.

ఇటీవ‌లే బెంగ‌ళూరులో ప‌ర్య‌టిస్తున్న ఓ వ్య‌క్తి.. తాను వెళ్లాల్సిన గ‌మ్య‌స్థానానికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అత‌ను చేయాల్సింది కేవ‌లం 45 నిమిషాల జ‌ర్నీ మాత్ర‌మే. ఇందుకోసం ర్యాపిడో ఆటోను బుక్ చేసుకున్నాడు.

కానీ ఆటో మాత్రం బుక్ చేసుకున్న త‌ర్వాత 225 నిమిషాల‌కు పిక‌ప్ పాయింట్‌కు చేరుకుంది. అంటే స‌ద‌రు ప్ర‌యాణికుడు దాదాపు 3.7 గంట‌ల స‌మ‌యం ఆటో కోసం నిరీక్షించాడు. ర‌ద్దీ స‌మ‌యాల్లో బెంగ‌ళూరులో ట్రాఫిక్ జాం ఎలా ఉంటుందో దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ ఘ‌ట‌న‌పై ర్యాపిడో స్పందించింది. స‌ద‌రు ప్ర‌యాణికుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. మీకు క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నాం.. మీ ఓపిక‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని ర్యాపిడో పేర్కొంది.

Latest News