విధాత, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి సీఎం కేసీఆర్ పార్టీ బీ ఫామ్ ను ప్రగతి భవన్‌లో శుక్రవారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును అందజేశారు.
తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్ కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు.
కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రొఫైల్:
పేరు: కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి S/౦.జంగారెడ్డి
సతీమణి: అరుణ.
కుమారుడు కుసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, కోడలు స్రవంతి.
కూతురు రమ్య, అల్లుడు శ్యాం సుందర్ రెడ్డి.
స్వగ్రామం: లింగంవారిగుడెం,
మండలం: నారాయణ పురం, యాదాద్రి జిల్లా.
విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకoగా పని చేసి కేసీఆర్ పిలుపునందుకొని ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చారు. 2003 నుంచి టీఆర్ఎస్‌లో క్రియాశీలక పాత్ర. మునుగోడు నియోజకవర్గ ఇంచార్జిగా పని చేశారు. తెలంగాణలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఇంచార్జిగా, వెళ్లి టీఆర్ఎస్ గెలుపునకు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కృషి చేశారు. 2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యే గా టీఆర్ఎస్ నుంచి పోటీ. 2104 లో ఎమ్మెల్యేగా గెలుపు. 2018లో మునుగోడు నుంచి పోటీ. స్వల్ప మెజార్టీతో ఓటమి. చదువు : బీఏ, బీఈడీ పూర్తి చేశారు.