Site icon vidhaatha

Bike Stunts | ముందు, వెనుక అమ్మాయిలు.. బైక్‌పై యువ‌కుడి స్టంట్లు.. వీడియో వైరల్

విధాత‌: ఓ యువ‌కుడు స‌ర‌దా కోసం భ‌యంక‌ర‌మైన స్టంట్ల‌కు పాల్ప‌డ్డారు. బైక్‌పై ఇద్ద‌రు అమ్మాయిల‌ను ఎక్కించుకుని చేసిన స్టంట్ (Bike Stunts) వీడియో వైర‌ల్ అవుతోంది. బైక్‌పై ముందు ఓ అమ్మాయిని, వెనుకాల మ‌రో అమ్మాయిని కూర్చోపెట్టుకున్నాడు ఆ యువ‌కుడు.

ఇక ముందు కూర్చున్న అమ్మాయి అత‌డిని గ‌ట్టి కౌగిలించుకుని ఉంది. వెనుకాల కూర్చున్న అమ్మాయి కూడా కౌగిలించుకుంది. ఇక మ‌నోడు రెచ్చిపోయాడు. బైక్ ముందు టైర్‌ను అమాంతం గాల్లోకి లేపి.. స్టంట్ల‌కు పాల్ప‌డ్డాడు.

వారి స్టంట్‌ను మరో బైకర్‌ వీడియో తీయగా.. పాట్‌హోల్‌ వారియర్స్‌ ఫౌండేషన్ అనే సంస్థ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. బైక్‌ నంబర్‌ ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలని ముంబై ట్రాఫిక్‌ పోలీసులను కోరుతూ క్యాప్షన్ జత చేసింది.

దీనికి స్పందించిన పోలీసులు బైకర్‌తోపాటు ఆ ఇద్దరు అమ్మాయిలపై కేసు నమోదు చేసినట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఆ యువ‌కుడితో పాటు యువ‌తుల గురించి ఎవరికైనా వివరాలు తెలిస్తే తమకు చెప్పాలని.. బైక్‌ నంబర్‌ను అందులో ఉంచారు. వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు.

Exit mobile version