విధాత, క్రికెట్: భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీని తప్పించటంతో ఆ స్థానంలో బిన్నీ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. బీసీసీఐ వార్షిక సభ్య సమావేశంలో ఈ మేరకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. బిన్నీ ఛైర్మన్ గా కొత్త పాలక వర్గం బాధ్యతలు స్వీకరించింది.