Biparjoy Cyclone | బిప‌ర్ జాయ్ తుఫాన్ బీభ‌త్సం

Biparjoy Cyclone భారీ ఎత్తున ఎగిసిప‌డుతున్న స‌ముద్రపు అల‌లు ముంబైలోని జుహు బీచ్‌లో ఇద్ద‌రు బాలుర మృతి మ‌రో ఇద్ద‌రు గ‌ల్లంతు.. మ‌రొక‌రిని కాపాడిన స్థానికులు గుజ‌రాత్ క‌చ్‌లో ఈ నెల 15 వ‌ర‌కు బ‌డుల‌కు సెల‌వు విధాత‌: బిప‌ర్ జాయ్ తుఫాన్ (Biparjoy Cyclone) దేశంలో బీభ‌త్సం సృష్టిస్తున్న‌ది. ఈ తుఫాన్ కారణంగా స‌ముద్ర‌పు అల‌లు భారీ ఎత్తున ఎగిసిప‌డుతున్నాయి. ప‌శ్చిమ ముంబై శివారులోని జుహు కోలివాడ బీచ్‌లో స‌ముద్ర అల‌ల కార‌ణంగా ఇద్ద‌రు బాల‌లు […]

  • Publish Date - June 13, 2023 / 07:51 AM IST

Biparjoy Cyclone

  • భారీ ఎత్తున ఎగిసిప‌డుతున్న స‌ముద్రపు అల‌లు
  • ముంబైలోని జుహు బీచ్‌లో ఇద్ద‌రు బాలుర మృతి
  • మ‌రో ఇద్ద‌రు గ‌ల్లంతు.. మ‌రొక‌రిని కాపాడిన స్థానికులు
  • గుజ‌రాత్ క‌చ్‌లో ఈ నెల 15 వ‌ర‌కు బ‌డుల‌కు సెల‌వు

విధాత‌: బిప‌ర్ జాయ్ తుఫాన్ (Biparjoy Cyclone) దేశంలో బీభ‌త్సం సృష్టిస్తున్న‌ది. ఈ తుఫాన్ కారణంగా స‌ముద్ర‌పు అల‌లు భారీ ఎత్తున ఎగిసిప‌డుతున్నాయి. ప‌శ్చిమ ముంబై శివారులోని జుహు కోలివాడ బీచ్‌లో స‌ముద్ర అల‌ల కార‌ణంగా ఇద్ద‌రు బాల‌లు మ‌ర‌ణించారు.

మ‌రో ఇద్ద‌రు బాలురు గ‌ల్లంత‌య్యారు. మ‌రోవైపు తుఫాన్ ప‌రిణామాల‌పై ప్ర‌ధాని మోదీ ఢిల్లీలో స‌మీక్ష నిర్వ‌హించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుజరాత్‌, ముంబై తీర ప్రాంతాల్లో అవ‌స‌ర‌మైన స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.