విధాత: తెలంగాణ బీజేపీ(BJP) నిరుద్యోగ మార్చ్(unemployment march)కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ చేపట్టనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ప్రకటించారు.
బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇందిరా పార్కు వద్ద చేసిన నిరుద్యోగ మహాధర్నాలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ పాలనలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇక ఉద్యోగాలొస్తాయనే ఆశ పెట్టుకోవద్దు.. మేమున్నాం.. మీరేం భయపడకండి. బీజేపీ అధికారంలోకి రాగానే.. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం అని సంజయ్ ప్రకటించారు. డీఎస్సీ-2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమకారులారా.. ఇంకెన్నాళ్లీ మౌనం..?
తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి తెలంగాణ ఉద్యమకారులారా.. ఇంకెన్నాళ్లీ మౌనం? ఏమైంది ఆనాటి ఉద్యమ స్పూర్తి? కేసీఆర్ కేసులు పెడతారని భయపడుతున్నారా? 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నాశనమవుతున్నా స్పందించరా? రండి మీకు అండగా మేమున్నాం. మీకు బాధవస్తే మా భుజాన వేసుకుంటాం… నిరుద్యోగుల తరపున రొడ్డెక్కి కొట్లాడదాం.. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు.
KCR’s son claimed leakage was bcos of 2 people, but so far how did they detain 13 ?#TwitterTilluMustResign
Govt is giving notices to opposition who is demanding to catch the culprits. Such is the pathetic situation in Telangana where demand for justice is met with notices. pic.twitter.com/3GVAYtLPgF
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 25, 2023
జైళ్ల డీజీ ఖబడ్దార్.. వచ్చేది మా ప్రభుత్వమే..
30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన బీజేవైఎం నాయకులను జైళ్లో వేశారు. అక్కడ ఇష్టానుసారం వేధిస్తున్నారు.. జైళ్ల డీజీ ఖబడ్దార్.. వచ్చేది మా ప్రభుత్వమే.. నీకు చిప్పకూడు తిన్పిస్తాం అని సంజయ్ హెచ్చరించారు. సిగ్గుండాలే.. ప్రభుత్వ ఉద్యోగిగా జీతం తీసుకుంటూ.. ధర్మం కోసం, నిరుద్యోగుల పక్షాన జైలుకొచ్చిన వాళ్లను వేధిస్తారా? బూతులు తిట్టిస్తారా? రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తారా? ఇది న్యాయమేనా అని మీ కుటుంబ సభ్యులను అడగండి అని సూచించారు.
నిరుద్యోగులు చస్తుంటే.. రాహుల్ కోసం బ్లాక్ డే అంటావా..?
ఉస్మానియా వర్శిటీ వెళ్లి చూస్తే ఎంత దారుణ పరిస్థితులున్నాయో తెలుసుకోండి.. 30 లక్షల మంది నిరుద్యోగులు చస్తుంటే కనీసం పట్టించుకోని కేసీఆర్.. రాహుల్ గాంధీ కోసం బ్లాక్ డే అంటావా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిద్ర మత్తులో ఉంది.. ఇక ఆ పార్టీ లేవదు అని విమర్శించారు. ఉస్మానియా విద్యార్థులారా.. తెలంగాణ తరహాలో మరో పోరాటానికి సిద్ధం కండి.. మేం మీ వద్దకు వస్తాం.. పోలీసు వలయాలను చేధించుకుని మీ తరపున పోరాడతాం అని సంజయ్ మద్దతు ప్రకటించారు.
ఒకరు లిక్కర్ క్వీన్.. ఇంకొకరు లీకేజీ కింగ్..
పాస్ పోర్ట్ బ్రోకర్ పాలనలో ఒకరు లిక్కర్ క్వీన్.. ఇంకొకరు లీకేజీ కింగ్.. అని కవిత, కేటీఆర్‌ను ఉద్దేశించి సంజయ్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు డబ్బుల్లేక మధ్యాహ్నం లంచ్ చేయరు… అన్నీ కలిపి సాయంత్రం 4 గంటలకు భోజనం చేస్తున్నారు.
వయసు మీద పడ్డా ఉద్యోగాలు రాక గడ్డాలు పెంచుకుంటూ చదువుకుంటున్నారు. కుటుంబాలకు భారమయ్యారు. కేసీఆర్ ఫ్రభుత్వంపై ఆశ పెట్టుకోవద్దు.. ఉద్యోగాలివ్వదు.. నిరుద్యోగులను మోసం చేసేందుకు నోటిఫికేషన్లు ఇస్తారు.. లీకేజీలతో జాప్యం చేస్తూనే ఉంటారు అని సంజయ్ పేర్కొన్నారు.
Live : Nirudyoga MahaDharna #BJPWithTSJobAspirants https://t.co/mnfOJVuVoX
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 25, 2023