విధాత: కుట్రలు చేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ యత్నించిందనని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మరోసారి స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి తెలిపారు. బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుందన్నారు. కేసీఆర్‌ను తెలంగాణకే పరిమితం చేసేలా బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. వ్యక్తుల ప్రాబల్యంతోనే గత ఉపఎన్నికల్లో గెలిచారే తప్ప బీజేపీతో కాదన్నారు.
ఓ వ్యక్తిని కొనడానికి మోదీ రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో టచ్‌లో ఉన్నాననడం దిగజారుడుతనమే. మునుగోడులో ఓడితే పదవి నుంచి తీసివేస్తారనే రేవంత్‌రెడ్డికి భయం. ఏడ్చేవారికి ఏం సమాధానం చెప్తాం? భారత్ జోడో యాత్రను ఎవరూ పట్టించుకోవటం లేదు. రాహుల్.. పార్టీనే జోడించడం లేదు, దేశాన్ని ఏం జోడిస్తారు?’’ అని ప్రశ్నించారు.
బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ పోరాడుతుందని మంత్రి ఉద్ఘాటించారు. ఇందుకు కమ్యూనిస్టులు మాతో కలిసి వస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ మాతో కలిసి పని చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. రాజీనామాతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మటం లేదని, ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి అన్నారు.
ఫలితం రాబోయే సాధారణ ఎన్నికలపై పడుతుందని, . మునుగోడులో ఓడిపోతే పదవి నుంచి తీసివేస్తారనే భయం రేవంత్‌కు పట్టుకుందన్నారు. ఏడ్చే వారికి ఏం సమాధానం చెప్తాం. బీఆర్‌ఎస్‌తో తెలంగాణ అస్తిత్వానికి ఏం ప్రమాదం లేదు. వంద శాతం ప్రజల మద్దతు ఏ ప్రభుత్వానికి ఉండదు. మేము ఉద్యమంతో తెచ్చిన ఉప ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను పోల్చవద్దు అని మంత్రి తెలిపారు.