Site icon vidhaatha

మునుగోడు: ఓ వైపు మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం.. మరోవైపు టీఆర్‌ఎస్‌లో చేరిన BJP నేతలు

విధాత: మునుగోడు మండలంలో బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. పలివెలలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ వైపు ప్రచారం నిర్వహిస్తుండగా మరో వైపు అదే గ్రామానికి చెందిన మునుగోడు మండలాధ్యక్షుడు పలివెల సర్పంచ్ గజ్జెల బాలరాజ్ గౌడ్, కార్యదర్శులు జానయ్య, నర్సింహ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన రవి ఆధ్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చౌటుప్పల్‌ మున్సిపల్‌ పరిధిలో..

అదేవిధంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు లింగోజిగూడ, 2వ వార్డుకు చెందిన BJP ముఖ్య కార్యకర్తలు జంపాల యాదగిరి, జంపాల యాదయ్య, జంపాల సాయి, తీగల వెంకటేష్, జంపాల లింగస్వామి, జంపాల సత్తయ్య, శ్రీనివాస చారిలు, వారి కుటుంబ సభ్యులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ స్వామి గౌడ్, వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు ప్రసాద్, బత్తిని లతా గౌడ్ , అంబాల నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version