Site icon vidhaatha

ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?.. ఒక్క రూపాయ్ ఇవ్వను: పూరీ ఫైర్!

విధాత, సినిమా: డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఇంకా ‘లైగర్’ కష్టాలు వెంటాడుతున్నాయి. విజయ్ దేవరకొండతో చేసిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాను కొనుక్కున్న వారందరికీ భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో పూరి జగన్నాథ్‌ని వారు సంప్రదించడం, ఎంతో కొంత రికవరీ చేస్తానని పూరీ మాట ఇవ్వడం జరిగినట్లుగా ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి.

అయితే సడెన్‌గా.. ఎగ్జిబిటర్స్ అందరూ.. పూరీ జగన్నాథ్ ఇంటి వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వాట్సప్ సర్కిల్స్‌లో ఓ వార్త వైరల్ అవుతోంది. వాట్సప్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్న మెసేజ్‌ను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో.. ఆ మెసేజ్‌లపై ఇప్పుడు కథకథలుగా చర్చలు నడుస్తున్నాయి.

ఈ మెసేజ్ చూసిన పూరి కూడా ఫైర్ అవుతూ.. మాట్లాడుతున్న ఓ ఆడియో టేపు సోషల్ మాధ్యమాలలో లీకవడంతో.. ‘లైగర్’ వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ముందుగా రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన వాట్సప్ మెసేజ్ సందేశం విషయానికి వస్తే.. ‘‘వరంగల్ శీను లైగర్ బాధితులంతా మొత్తం 83 మంది ఎగ్జిబిటర్స్ బేస్తవారం ఉదయం 9 గంటలకు 27వ తారీఖున ప్రతి ఎగ్జిబిటర్ పూరి జగన్నాథ్‌గారి ఇంటికి ధర్నాకి వెళ్తున్నాము.

కావున ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ మినిమం నాలుగు రోజులు ఉండటానికి బట్టలు తీసుకొని ఎగ్జిబిటర్‌తో నలుగురు వ్యక్తులను తీసుకుని రావాలి. ఇలా అందరూ మాకెందుకులే అని రాకపోతే ఈ బాధితుల లిస్ట్‌లో నుంచి మీ యొక్క పేరు తొలగించి.. మీకు రావాల్సిన డబ్బులన్ని కూడా క్యాన్సిల్ చేయబడును. దీన్ని హెచ్చరికగా భావించకుండా.. తప్పనిసరిగా రాగలరు. ఎవరు ఆరోజు రాకపోయినా.. మీకు మేము ఫోన్ చేయము, సమాచారం ఇవ్వము.

అందరం బాధితులమే కాబట్టి.. అందరూ బాధ్యతగా వస్తేనే బాగుంటుంది.. రాకపోతే మీ ఇష్టం. అందరూ ఉదయరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఆఫీస్‌కు రావాలి. అక్కడి నుంచి పూరి జగన్నాధ్ ఇంటికి వెళ్లాలి. మళ్లీ మళ్లీ చెప్తున్నాము.. దయచేసి మీరందరూ రావాలి. పైసలు వద్దు అనుకున్న వాళ్లు మాత్రం దయచేసి రాకండి’’.. అని వాట్సప్‌లో వైరల్ అవుతున్న సందేశం.

లీక్‌డ్‌ ఆడియో

దీనికి పూరి స్పందించిన ఆడియో టేపులో ఏముందంటే..

‘‘మెసేజ్ చూశాను. ఇది బయట బాగా సర్కులేషన్ అవుతున్నట్లుంది. ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ తిరిగి డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇస్తున్నాను.. ఎందుకు? పాపం వాళ్లు కూడా మనలానే నష్టపోయారులే అని. ఆల్రెడీ బయ్యర్స్‌తో మాట్లాడటం జరిగింది. ఒక అమౌంట్ ఇస్తామని చెప్పాం. వాళ్లు ఒప్పుకున్నారు.

Exit mobile version