Site icon vidhaatha

Brahmanandam | కర్ణాటక ఎన్నికల్లో బ్రహ్మానందం ప్రచారం

Brahmanandam , Chickballapur

విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలుగు స్టార్‌ కమెడియన్‌ బ్రహ్మానందం హల్‌చల్‌ చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని చిక్కబళ్లాపూర్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మంత్రి K.సుధాకర్‌ తరపున ప్రచారం నిర్వహించారు.

తెలుగు ప్రజలు అధికంగా నివసించే ఆ నియోజకవర్గంలో ప్రజలు అధికారికంగా కన్నడ మాట్లాడినా తెలుగుకే ప్రాధాన్యం ఇస్తారు. దీంతో నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి ప్రముఖులతో కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా గురువారం రోజున బ్రహ్మానందం ఇక్కడ నిర్వహించిన రోడ్‌ షోకు విశేష లభించింది. రోడ్లన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి.

ఈ సందర్భంగా బ్రహ్మానందం తనదైన స్టైల్‌లో తన సినిమాలలోని డైలాగులు, పంచులతో మాట్లాడి జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అభ్యర్థి విజయోత్సవం రోజు మళ్లీ వస్తానని హమీ ఇచ్చారు.

అయితే 2019లోను బ్రహ్మానందం ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన సుధాకర్‌ తరపున ప్రచారం నిర్వహించారు.

Exit mobile version