Site icon vidhaatha

పాతగుట్ట ఆలయంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు

విధాత : యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారి నిత్యారాధన అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, స్వస్తివాచనం కార్యక్రమాలను నిర్వహించారు.


ప్రధాన అర్చకులు నందిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు, యజ్ఞచార్యులు,అర్చక బృందం, పారాయణికులు పాంచరాత్రాగమ శాస్త్రానుసారం బ్రహ్మోత్సవ ఘట్టాలను ఆరంభించారు. ఆలయ సంప్రోక్షణకు పుణ్యాహవాచన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణం, మత్సంగ్రహణం కార్యక్రమాలను నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈవో ఎస్. రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 25 వరకు పాతగుట్ట లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.

Exit mobile version