Site icon vidhaatha

Bray Wyatt | అభిమానులకు షాక్‌.. WWE సూపర్ స్టార్ బ్రే వ్యాట్ క‌న్నుమూత

Bray Wyatt |

ఇటీవ‌ల చిన్న వ‌య‌స్సులోనే గుండెపోటుతో క‌న్నుమూస్తుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. హెల్త్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న సెల‌బ్స్ కూడా చిన్న వయ‌స్సులో మృతి చెందుతున్నారు. తాజాగా వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాజీ ఛాంపియన్, WWE సూపర్ స్టార్ బ్రే వ్యాట్ గుండెపోటుతో హఠాన్మ‌ర‌ణం చెందారు.

36 ఏళ్ల బ్రే వ్యాట్ గత కొంత కాలం నుంచి హృదయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ ప‌డుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో రింగులో కూడా క‌నిపించ‌డం లేదు. ఊహించ‌ని విధంగా బ్రే వ్యాట్ హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో డబ్ల్యూడబ్ల్యూఈ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రే వ్యాట్ అసలు పేరు విండామ్ రొటుండా కాగా, బహిర్గతం చేయలేని ఆరోగ్య సమస్యతో కొన్నాళ్లుగా ఇబ్బంది ప‌డుతున్నాడు.

2009 నుండి విండమ్ రొటిండా డబ్ల్యూడబ్బ్ల్యూఈ లో ఉండ‌గా, 2021 – 2022లో అతను ఊహించని విధంగా WWE నుంచి రిలీజ్ అయ్యాడు. అయితే వ్యాట్ WWEలో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్, WWE ఛాంపియన్‌షిప్ ఒకసారి, యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ రెండు సార్లు అందుకున్నారు.

2018 ఆగ‌స్ట్‌ నుంచి ఏప్రిల్ 2019 వరకు కొంత విరామం తీసుకున్న బ్రే వ్యాట్ అనంత‌రం త ది ఫైండ్ అనే కొత్త పాత్రతో తిరిగి రెజ్లింగ్ రింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా అభిమానులు ఎంతో సంతోషించారు. ప్రముఖ రెజ్లర్ అండర్‌టేకర్ వచ్చేటప్పుడు లైట్లన్నీ ఎలా ఆపేసే వారో బ్రే వ్యాట్ వచ్చే సమయంలోనూ అంతటి సంద‌డి నెలకొంటుంది.

బ్రే వ్యాట్ లాంతరు పట్టుకొని ఎంట్రీ ఇచ్చేవాడు. అదేవిధంగా డిఫరెంట్ క్యారెక్టర్లతోనూ, రెజ్లింగ్‌లో త‌న స్కిల్స్ చూపిస్తూ ఆక‌ట్టుకునేవాడు. అత‌డుచేసే విన్యాసాలు అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించేవి. కాగా, వ్యాట్ ది రెజర్లర్ల కుటుంబం. అతని తండ్రి హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రోటుండా.

ఇక అత‌ని తాత బ్లాక్‌జాక్ ముల్లిగాన్, ఒక ప్రొఫెషనల్ రెజ్లర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అత‌ని సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అతని మేనమామలు, బారీ, కెండల్ విండ్‌హామ్ కూడా రెజ్లింగ్ ప్రపంచంలో స‌త్తా చాటిన‌ట్టు అనేక ప్ర‌చారాలు సాగాయి. అయితే రొటుండా మూడవ తరం రెజ్లర్ కాగా, ఆయ‌న ఇలా హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌ పోతున్నారు.

Exit mobile version