విధాత: గుజరాత్ మోర్బీలో తీగల వంతెన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. వంతెనను ఇటీవలే ప్రారంభించగా.. ఆదివారం జరిగిన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి ముందు ఊయల మాదిరిగా ఊగుతుండగా.. కొందరు యువకులు ఇటూ అటూ దూకినట్టు దృశ్యాల్లో రికార్డైంది.
వంతెనను ఊపడం వల్లే ప్రమాదం.. విస్తూపోయో సీసీ ఫుటేజీ https://t.co/0Bro4v8WcT #MorbiBridgeCollapse pic.twitter.com/swnBUJYILp
— vidhaathanews (@vidhaathanews) October 31, 2022
అంతలోనే ఒక్కసారిగా తీగలు తెగిపోయి దానిపై ఉన్నవారు నదిలో పడిపోయారు. ఆ సమయానికి వంతెనపై 500 మంది వరకూ ఉన్నారు. ఈ దుర్ఘటనలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ప్రమాదంతో హాహాకారాలు చేస్తూ నదిలో మునిగిపోయారు. ఈత వచ్చిన వారుఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాని తమ ప్రాణాలను కాపాడుకున్నారు.