Site icon vidhaatha

BREAKING: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

విధాత: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. తదుపరి ప్రధానమంత్రి ఎన్నికయ్యే వరకు ఆమె పదవిలో కొనసాగుతారు. ట్రస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది వారాల తరువాత, ఆర్థిక వ్యవస్థ యొక్క దుర్వినియోగం పార్టీలో తిరుగుబాటును ప్రేరేపించింది.

గత వారం రోజుల్లో ఇద్దరు మంత్రులు ఈ పదవికి రాజీనామా చేశారు. లిజ్ ట్రస్‌ బ్రిటీష్‌ ప్రధానమంత్రిగా నియమితులై 40 రోజులు మాత్రమే అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది.

లిజ్ పార్టీకి చెందిన ఎంపీలు స్వయంగా పలు ప్రశ్నలను లేవనెత్తడంతో ట్రస్‌ స్థానంలో మరో నేతను ప్రధానిని చేయవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. కాగా, మూడు రోజుల తర్వాత మౌనం వీడియ ప్రధాని లిజ్‌ ట్రస్‌.. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తప్పులను అంగీకరించారు. ప్రజలు కూడా తమ తప్పులకు క్షమించాలని కోరింది. బ్రిటన్‌ ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలనుకుంటున్నానని, అయితే, దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు.

అంతర్జాతీయంగా బ్రిటన్‌ పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావం చూపిందని తెలిపారు. ‘‘ప్రజలకు ఏదో మేలు చేయాలని అనుకున్నాం. అధిక పన్నుల విషయంలో వారికి దోహదపడే నిర్ణయాలు తీసుకున్నాం. కానీ, మేం ఎక్కడో పొరపాటు చేశాం.’’ అని వ్యాఖ్యానించారు.

కాగా, మినీ బడ్జెట్‌లో ప్రకటించిన పన్నుల తగ్గింపును పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్టు నూతన ఆర్థిక మంత్రి జెర్మీ హంట్‌ ప్రకటించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశ దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితిపై హంట్‌కు అవగాహన ఉందని అన్నారు.

అయితే.. సొంత పార్టీ ఎంపీ జెరేమీ హంట్‌ పేరును లేవనెత్తకుండా.. ‘నేను ప్రధానమంత్రి పదవిలోకి వచ్చి నెల రోజులే అయ్యింది. విషయాలు సరైన మార్గంలో నడవడం లేదని అంగీకరిస్తున్నాను. త్వరలో వాటిని పరిష్కరిస్తాం. ఇప్పుడు ట్రాక్‌లోకి రావాలంటే ఇతర మార్గాలను అవలంబించాలి’ అని చెప్పారు. తక్కువ పన్ను, అధిక వృద్ధి ఫార్ములా కొనసాగుతుందని వెల్లడించారు.

Exit mobile version