Site icon vidhaatha

Protesting LPG Price Hike। గ్యాస్‌ ధరలపెంపుదలకు నిరసనగా కాంగ్రెస్‌, BRS ఆందోళనలు

BJP-led Modi government hikes gas rates

hikes gas rates । వంట గ్యాస్‌ ధరల పెంపుదలకు నిరసనగా గురువారం తెలంగాణ అట్టుడికింది. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ధర్నాలు, ఆందోళనలకు దిగడంతో నినాదాలు హోరెత్తాయి.

విధాత: బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరల (LPG Price Hike)పెంపుదలకు నిరసనగా కాంగ్రెస్‌ (Congress), బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీలు పోటా పోటీగా ఆందోళనలు చేపట్టాయి. ఇది ఎన్నికల ఏడాది కావడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ కార్యకలాపాలు పెంచాయి. కీలకమైన సమయంలో గ్యాస్‌ ధరలు పెంచడం ద్వారా ప్రతిపక్షాలకు (Opposition) గట్టి అస్త్రాన్ని బీజేపీయే ఇచ్చినట్టయింది.

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 ఉండగా 9 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం (Narendra Modi) గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.1200కు పెంచిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు మహిళా కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీనాయకులు కార్యకర్తలు నగరంతో పాటు రాష్ర్టంలో పలు చోట్ల గ్యాస్‌ సిలిండర్లు పట్టుకొని ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు నిర్వహించారు.

రాష్ర్టంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ర్టంలో పలు చోట్ల గ్యాస్‌ ధరల పెంపుదలకు నిరసనగా ఆందోళనలు చేపట్టింది. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గ్యాస్‌ సిలిండర్లు పట్టుకొని ఆందోళనకు దిగారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మహిళలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నా చేపట్టగా, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఇలా అన్ని జిల్లాల్లో బీఆర్‌ ఎస్‌ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేల నాయకత్వంలో గ్యాస్‌ ధరల పెంపుదలకు నిరసనగా ధర్నాలు చేపట్టారు. పలు చోట్ల రోడ్లపై వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు.

Exit mobile version