విధాత: BRS అంటే భారత్ రాష్ట్ర సమితి కాదు, బీహార్ రాష్ట్ర సమితి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో ఎంతోమంది రైతులు చనిపోయినా పట్టించుకోని ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాల వారికి మాత్రం పరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయకపోతే వీఆర్ఏలు అంతా కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయాలని రేవంత్ సూచించారు.
వీఆర్ఏలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ రూ. 1000 నోటు లాంటిది, దానికి ఒకప్పుడు విలువ ఉండేది. ఇప్పుడు దాని విలువ సున్నా. ఉంటే పట్టుకుని వెళ్లి లోపల వేస్తరని సెటైర్ వేశారు. అందుకే టీఆర్ఎస్‌లో ఉన్న శ్రేణులకు చెబుతున్నా మీరు ఇంకా ఆ పార్టీలో కొనసాగితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.
ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఇసుక, భూ దోపిడీ, మైన్, ల్యాండ్, సాండ్ ఇట్లాంటివి ఘోరాలు నేరాలు చేశారో అందులో జైలుకు వెళ్లడం తప్పదు కాబట్టి ఆయన ఎట్లాగూ సంపాదించుకున్నడు. వెళ్తే జైలుకు వెళ్తాడు. ఆయనతో ఉండి మీరు శిక్షణ అనుభవించాల్సిన అవసరం లేదు. తెలంగాణ పదమే ఆయన వద్దు అనుకున్నప్పుడు తెలంగాణకు కూడా చంద్రశేఖర్ రావు వద్దు అని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను అన్నారు.