Site icon vidhaatha

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు.. ఆరు గంటలుగా కవితను విచారిస్తున్న సీబీఐ

విధాత,హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అధికారులు గత ఆరు గంటలుగా నిజామాబాద్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ తనయను విచారిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి చేరుకున్న అధికారులు.. లిక్కర్ పాలసీలో పాత్రపై ఆరా తీస్తున్నారు.

దేశవ్యాప్తంగా సంచ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు ఇవాళ మధ్యహ్నం సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో చేరుకున్న అధికారులు ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు.

ఈ బృందంలో ఓ మహిళా అధికారి సైతం ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు కవితను విచారిస్తున్నారు. స్కామ్‌కు సంబంధించి రూ.100 కోట్ల ముడుపులు తరలింపులో కవిత భాగస్వామిగా వ్యవహరించారని, అలాగే కవిత పది ఫోన్లు మార్చడంతో పాటు ధ్వంసం చేసినట్లు సీబీఐ ఆరోపిస్తున్నది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం: MLC కవిత విచారణ..! ఇంకా ముగియలే.. ముందుంది ముస‌ళ్ల పండుగ?

ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ, వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా కవితను విచారిస్తున్నది. గత ఆరుగంటలుగా విచారణ కొనసాగుతుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీబీఐ విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీకానున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇదిలా ఉండగా.. సీబీఐ విచారణ నేపథ్యంలో కవితకు సంఘీభావంగా ఫ్లెక్సీలు, కటౌట్లను భారత్‌ రాష్ట్ర సమితి శ్రేణులు ఏర్పాటు చేశాయి.

Exit mobile version