Site icon vidhaatha

సుప్రీంకోర్టు సీజేఐగా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నియామకం

విధాత: సుప్రీంకోర్టు 50వ‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ) జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నియ‌మితుల‌య్యారు. సీజేఐగా చంద్ర‌చూడ్ నియామ‌కానికి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద‌ముద్ర వేసిన‌ట్టు కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

ప్ర‌స్తుత సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ యుయు లలిత్ 74 రోజుల ప‌ద‌వీ కాలం న‌వంబ‌ర్ 8న ముగియ‌నున్న‌ది. న‌వంబ‌ర్ 9న జ‌స్టిస్ చంద్ర‌చూడ్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. రెండేళ్లు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొన‌సాగ‌నున్న జ‌స్టిస్ చంద్ర‌చూడ్ 2024 న‌వంబ‌ర్ 10న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

Exit mobile version