Site icon vidhaatha

పాలకుర్తిలో చింతచెట్టుకు కల్లు.. వీడియో వైరల్‌.!

Viral Video | కొన్ని ఘటనలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగకమానదు. ఇప్పటి వరకు పలు చెట్ల నుంచి నీరు వచ్చిన దృశ్యాలు చూశాం.. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. చింత చెట్టుకు కల్లు పారుతున్నది.

ఈ వార్త సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న జనం విచిత్ర ఘటనను చూసేందుకు తరలివస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సమీపంలోని అంగడి బజారులోని ఎల్లబోయిన సొమ్మళ్లు ఇంటి ఆవరణలో ఉన్న చింత చెట్టుకు కల్లు ఏరులై పారుతున్నది.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనను చూసేందుకు పోటీపడుతున్నారు. ఈ వార్త చుట్టు పక్కల ప్రాంతాలకు పాకడంతో చూసేందుకు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. అయితే, పలువురు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిందే జరుగుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

గతంలో వేప చెట్టు నుంచి పాలు కారాయని, నీళ్లు వచ్చిన సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version