Site icon vidhaatha

ఇక్కడ ఆయన లేరు కదా.. గరికపాటిపై చిరు సెటైర్లు

విధాత‌, సినిమా: మెగాస్టార్‌ చిరంజీవి తనని అవమాన పరిచిన గరికపాటికి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు. సున్నితంగా చెబుతూనే అదిరిపోయే సెటైర్లు వేశారు. తనదైన స్టయిల్‌లో సెటైర్లు వేయడం విశేషం. తాజాగా ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

చిరంజీవిపై రాసిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయనే గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మహిళలతో మరోసారి ఫోటో సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఇక్కడ ఆయన లేరు కదా’ అంటూ వ్యాఖ్యానించడం విశేషం. దీంతో సభ మొత్తం నవ్వులతో హోరెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Exit mobile version