Site icon vidhaatha

1800 కోట్ల బకాయిలు విడుదల చేయండి

న్యూఢిల్లీ : తెలంగాణకు రావాల్సిన వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నీతి ఆయోగ్‌ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. మంగళవారం ఢిల్లీలో నీతి ఆయోగ్‌ వైఎస్‌ చైర్మన్‌ సుమన్‌ భేరీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు. అందుకు అవసరమైన ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతోపాటు విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే సంస్కరణలకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ కూడా ఉన్నారు.

Exit mobile version