Site icon vidhaatha

సాగర్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య విధాన పరిషత్ కమిషనర్..! ముందస్తు లీక్‌తో అంతా విధుల్లోనే!

విధాత: నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని శుక్రవారం రాత్రి వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులను తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి నాగార్జునసాగర్ ప్రభుత్వ కమల నెహ్రూ హాస్పిటల్ తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు గర్భిణీ స్త్రీలకు అందుబాటులో డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సాగర్ ఆస్పత్రిలో గతంలో కంటే ప్రస్తుతం 24 గంటలు డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని గర్భిణీలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీ హెచ్ మాతృనాయక్ ,హాస్పిటల్ సూపర్డెంట్ భాను ప్రసాద్ డాక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ముందే లీకయిన ఆకస్మిక తనిఖీ

సాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రిలో మధ్యాహ్నమైతేనే డాక్టర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండరు ఇది జగమెరిగిన సత్యం. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీ సమయంలో జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి డీసీహెచ్‌తో పాటు కమలా నెహ్రు ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా రాత్రి 9 గంటల సమయంలో ఆసుపత్రిలోనే విధుల్లో ఉన్నారు.

వీరితో పాటు ఆసుపత్రి డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది తమ విధుల్లో ఉండడం చూస్తే వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ ముందుగానే లీకైనట్లు తెలుస్తుంది. కమిషనర్ ముందస్తు తనిఖీ తీరు ముందస్తు లీక్ తో ఫెక్ తనిఖీగా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Exit mobile version