విధాత: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్ రాజ్‌ని ఎస్ఆర్‌నగర్ లోని ఆయన నివాసంలో కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనను ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రాజగోపాల్‌రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు.
ఓ న్యూస్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని BJPలో చేరానని స్వయంగా ఆయనే చెప్పారని రాజగోపాల్ రెడ్డిని పొటీకి అనర్హుడిగా ప్రకటించాలని TRS పార్టీ జనరల్ సెక్రెటరీలు శ్రీనివాస్ రెడ్డి, సోమ భరత్, తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌లు ఎన్నికల ప్రధాన అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు.