విధాత, హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారంటూ ముగ్గురు వ్యక్తులపై ఏసీబీ పెట్టిన కేసు సెక్షన్లు సీఎం కేసీఆర్‌కూ వర్తింప చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. 1988 అవినీతి నిరోధక చట్టం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన విషయంలో కేసీఆర్‌కు ఎందుకు వర్తించదని బక్కా జడ్సన్ ప్రశ్నించారు.
2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రలోభపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీజేపీ నాయకులు 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోబాపెట్టినందుకు 1988 అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా కేసీఆర్ పై కుడా అదే చట్టం కింద ఇంట్రగేషన్ చేయ్యాలని ఫిర్యాదు చేశామని తెలిపారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేల జాబితాను కూడా తన ఫిర్యాదుకు జత చేశారు.
1) చిదమర్తి లింగయ్య నక్రేకల్ అసెంబ్లీ,
2)గండ్ర రమణారెడ్డి భూపాలపల్లి అసెంబ్లీ,
3) హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ అసెంబ్లీ,
4) ఉపేందర్ రెడ్డి పాలేరు అసెంబ్లీ ,
5) రేగా కాంత రావు పినపాక అసెంబ్లీ,
6) హరిప్రియ నాయక్ ఇలాందు అసెంబ్లీ,
7) తాండూరు అసెంబ్లీ రోహిత్ రెడ్డి,
8) ఎల్లారెడ్డి అసెంబ్లీ జాజుల సురేందర్,
9) కొత్తగూడెం అసెంబ్లీ వనమా వెంకటేశ్వరరావు,
10) మహేశ్వరం అసెంబ్లీ సబితా ఇంద్రారెడ్డి,
11) ఎల్‌బీ నగర్ అసెంబ్లీ సుధీర్ రెడ్డి,
12) ఆసిఫాబాద్ అసెంబ్లీ ఆత్రం సక్కు
అయితే.. ఫామ్ హౌస్ కేసులో ..బీజేపీతో బేరం ఆడినట్లుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారే. రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ముగ్గురూ.. కాంగ్రెస్ తరపున గెలిచి.. టీఆర్‌ఎస్‌లో చేరారు.
వారు అమ్ముుడుపోయారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తూ వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే శాసనసభాపక్షం విలీనం అయిందని గతంలో స్పీకర్ రూలింగ్ ఇవ్వడంతో వారు అధికారికంగా టీఆర్ఎస్ సభ్యులయ్యారు.
Today filed case on Telangana C.M KCR in Director General Anti Corruption Bureau office Under Prevention of Corruption Act 1988 for Bribing 12 Congress MLAs and joining TRS.@INCIndia @INCTelangana @kharge @RahulGandhi @revanth_anumula @TelanganaCMO @KTRTRS pic.twitter.com/IH0EXJ7QUA
— INC-JUDSΩΠβΔҜҜΔ – बक्का जेडसान – బక్క జడ్సన్ (@zson_bakka) October 29, 2022