Site icon vidhaatha

Wedding Kit | నూత‌న వ‌ధూవ‌రుల‌కు కండోమ్‌లు, గ‌ర్భ నిరోధ‌క మాత్ర‌లు పంపిణీ..

Wedding Kit | మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సామూహిక వివాహాలు వివాదానికి దారి తీశాయి. సామూహిక వివాహాలు చేసుకున్న నూత‌న వ‌ధూవ‌రులంద‌రికీ వెడ్డింగ్ కిట్‌తో పాటు కండోమ్‌లు, గ‌ర్భ నిరోధ‌క మాత్ర‌లు పంపిణీ చేశారు. సామూహిక వివాహాల పేరిట‌.. కండోమ్‌లు, గ‌ర్భ నిరోధ‌క మాత్ర‌లు పంపిణీ చేయ‌డం స‌రికాద‌ని జ‌నాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ అంశంపై జాబువా జిల్లా సీఎంహెచ్‌వో డాక్ట‌ర్ జేపీఎస్ ఠాకూర్ స్పందించారు. ఆందోళ‌న‌కు దిగిన వ‌ధూవ‌రుల కుటుంబాల‌కు స‌ర్దిచెప్పామ‌ని తెలిపారు. జ‌నాభా నియంత్ర‌ణ కోస‌మే ఆరోగ్య శాఖ అధికారులు కండోమ్స్, గ‌ర్భ నిరోధ‌క మాత్ర‌ల‌ను వెడ్డింగ్ కిట్‌లో భాగంగా అందించార‌ని తెలిపారు. ఇందులో త‌ప్పేమి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి క‌న్యా వివాహం స్కీమ్‌లో భాగంగా 296 జంట‌ల‌కు సామూహిక వివాహాలు జ‌రిపించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇటీవ‌ల క‌న్యా వివాహ స్కీమ్ వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. వ‌ధువుల‌కు ప్రెగ్నెన్సీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. దిండోరీలో జ‌రిగిన సామూహిక వివాహ వేడుక స‌మ‌యంలో వ‌ధువుల‌కు ప్రెగ్నెన్సీ ప‌రీక్ష‌లు చేపట్టారు. అయితే ఆ ప‌రీక్ష‌ల్లో ఓ మ‌హిళ‌కు పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సాధార‌ణ వ‌య‌సును తెలుసుకునేందుకు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంటామ‌ని, ఆ వ్య‌క్తుల్లో ర‌క్త‌హీన‌త ఉందో లేదో తెలుసుకునేందుకు ప‌రీక్ష చేప‌డుతుంటామ‌ని దిండోరి మెడిక‌ల్ ఆఫీస‌ర్ తెలిపారు.

Exit mobile version