Congress
విధాత, హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న సీడ్లూసీ సమవేశాల షెడ్యూల్ ను ఏఐసీసీ విడుదల చేసింది. ఈ నెల 16 శనివారం రోజు మధ్యాహ్నం 1 గంటకు భోజన కార్యక్రమాలు ఉంటాయని అనంతరం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. 17 ఆదివారం రోజు ఉదయం 10.30లకు సీడబ్లూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, సీపీపీ సభ్యులతో సమావేశాలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడలో విజయభేరి సభ జరగనుంది. అందులో సోనియాగాంధీ 5 గ్యారెంటీ హామీలు వెల్లడించనున్నారు.
సభ అయిపోగానే రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు చేరుకుంటారు. అక్కడే రాత్రి కార్యకర్తలతో బస చేస్తారు. మరుసటి రోజు 18 ఉదయం కార్యకర్తలతో సమావేశం జరుపుకొని వాకితో పాటు నేతలు ఇంటింటికి తిరుగుతూ ఐదు హామీలను ప్రచారం చేస్తారు. అలాగే బీఆరెస్ ప్రభుత్వ వైఫల్యాలను గడప గడప తిరిగి తెలియ జేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం కార్యకర్తలు,ప్రజలతో కలిసి భోజనాలు చేస్తారు. ఆ రోజు సాయంత్రం రాష్ట్రంలోని నియోజకవర్గాల్లోని గాంధీ, అంబేద్కర్, కొమరం భీం విగ్రహాల వద్దకు భారత్ జోడో మార్చ్ నిర్వహిస్తారు.