Site icon vidhaatha

కాంగ్రెస్‘హైద‌రాబాద్ స్వాతంత్య్రం’.. పాట, జెండా,విగ్రహంపై రేపు నిర్ణయం

విధాత: సెప్టెంబ‌ర్ 17 వేడుక‌లు ఘ‌నంగా జ‌రిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్న‌ది. హైద‌రాబాద్ స్వాతంత్య్రం పేరిట కాంగ్రెస్ వేడుక‌లు నిర్వ‌హించ‌నున్న‌ది. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి గాంధీ భ‌వ‌న్‌లో రేపు జాతీయ జెండా ఎగుర‌వేయ‌నున్నారు.

టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. నూత‌న రూపురేఖ‌ల‌తో విగ్ర‌హం త‌యారు చేయించింది. వేడుక‌ల్లో భాగంగా కాంగ్రెస్ నేత‌లు రేపు ఆ విగ్రహన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఏర్పాటుకు నిర్ణ‌యించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌త్యేక జెండాను ఆవిష్క‌రించ‌నున్న‌ది. అందెశ్రీ రాసిన జ‌య‌జ‌య‌హే పాట‌పై కాంగ్రెస్ పార్టీ రేపు ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ది.

Exit mobile version