Site icon vidhaatha

Bandla Ganesh | కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే అధికారం: బండ్ల గణేష్

విధాత : కేంద్ర, రాష్ట్రాల్లో రానున్నవి కాంగ్రెస్ ప్రభుత్వాలేనని సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) అన్నారు. సూర్యాపేటలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు బండ్ల గణేష్ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. భట్టి విక్రమార్కకు మద్దతు తెలపడం అదృష్టమన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే భారత దేశంకు స్వాతంత్రం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే బ్రిటిష్ వాళ్ల కింద బానిసలుగానే ఉండేవాళ్ళమన్నారు.

ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. సోనియా గాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు.

కర్ణాటక నుంచి కాంగ్రెస్ హుదూద్ తుఫాన్ మొదలైందని, తెలంగాణ నుండి గెలుచుకుంటూ, ఢిల్లీ వరకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. 150రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు.

Exit mobile version