Site icon vidhaatha

UP | రైల్వేస్టేష‌న్‌లో నిద్రిస్తున్న.. చిన్నారిపై కానిస్టేబుల్ క‌ర్క‌ష‌త్వం.. గొంతుపై కాలు పెట్టి..

UP

విధాత‌: అభాగ్యుల‌పై ఎవ‌రైనా జాలి చూపిస్తారు. అయ్యో పాపం అంటారు. అదే చిన్నారుల‌పై మ‌రింత ప్రేమ‌ను చూపుతారు. కానీ, ఓ చిన్నారిపై ఒక‌ కానిస్టేబుల్ క‌ర్క‌షంగా ప్ర‌వర్తించాడు. రైల్వే స్టేష‌న్‌లో నిద్రిస్తున్న చిన్నారిని లాఠీతో కొడుతూ, కాలితో త‌న్ని లేపాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో ఆ ఖాకీపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది.

ఉత్తరప్రదేశ్‌లోని బెల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న చిన్నారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ లాఠీతో కొట్టి త‌న్ని లేపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియోపై నార్త్ ఈస్టర్న్ రైల్వే స్పందింది. సంబంధిత కానిస్టేబుల్‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన‌ట్టు తెలిపింది.

గ‌తంలోనూ ఇదే త‌ర‌హా ఘ‌ట‌న‌లు

ఇదే త‌ర‌హా ఘ‌ట‌న‌లో గ‌తంలోనూ చోటుచేసుకున్నాయి. మధుర జంక్షన్ స్టేషన్‌లో జీఆర్‌పీ కానిస్టేబుల్ ఒక‌రు నిద్రిస్తున్న వ్య‌క్తిని త‌న్న‌డం, అతని పాదాల‌ను బూటు కాలి కింద న‌లిపేయం చేశాడు. పుణె రైల్వేస్టేష‌న్‌లో నిద్రిస్తున్న ప్ర‌యాణికుల‌పై ఓ పోలీస్ బాటిల్‌తో అడ్డ‌గోలుగా నీళ్లు చ‌ల్లుతూ నిద్ర లేపాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే, ఈ త‌ర‌హా దారుణాలు ఆగ‌డం లేదు

Exit mobile version