Site icon vidhaatha

నిమ్స్ లో గుండె మార్పిడి శస్త్ర చికిత్స

విధాత‌: పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతోంది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ గుండెను తుపాకుల హెస్సేన్ అనే పెయింటర్‌కు అమర్చ‌నున్నారు. నల్గొండ జిల్లా, గొల్లగూడెం దగ్గర ఈనెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరబాబు అనే కానిస్టేబుల్‌కు బ్రెయిన్ డెడ్ అయింది. ఆయన గుండెను సేకరించి పేయింటర్‌కు అమర్చుతున్నారు. మలక్‌పేట యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రికి గుండెను తరలించారు. నిమ్స్‌లో శస్త్ర చికిత్స జరుగుతోంది.

Exit mobile version