Vegetables Cultivation | నెల‌కు 3000 కిలోల కూర‌గాయ‌లు పండిస్తున్న యువ రైతు.. ఆదాయం రూ. 2 ల‌క్ష‌ల‌కు పైనే..

Vegetables Cultivation | ఓ యువ రైతు మాత్రం ఆర్గానిక్ ప‌ద్ధ‌తి( Organic Methods )లోనే కూర‌గాయ‌ల‌ను సాగు( Vegetables Cultivation ) చేస్తూ నెల‌కు 3000 కిలోల దిగుబ‌డి సాధిస్తున్నాడు. రిటైల్ మార్కెట్‌( Retile Market )తో పాటు బ‌ల్క్‌లో విక్ర‌యించి నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. మ‌రి ఆ యువ రైతు గురించి తెలుసుకోవాలంటే హ‌ర్యానా( Haryana ) వెళ్లాల్సిందే.

Vegetables Cultivation | చాలా మంది దీర్ఘ‌కాలిక పంట‌ల వైపే మొగ్గు చూపుతారు. ఆ పంట‌ల‌ను కూడా ర‌సాయ‌న ఎరువుల‌తో పండిస్తారు. కానీ కొంద‌రు స్వ‌ల్ప‌కాలిక పంట‌ల వైపు దృష్టిసారిస్తారు. అంటే కూర‌గాయ‌ల సాగు( Vegetables Cultivation )అన్న‌మాట‌. ఈ కూర‌గాయ‌ల సాగుకు చాలా మంది ర‌సాయ‌న ఎరువుల‌ను విరివిగా వినియోగిస్తారు. కానీ ఓ యువ రైతు మాత్రం ఆర్గానిక్ ప‌ద్ధ‌తి( Organic Methods )లోనే కూర‌గాయ‌ల‌ను సాగు చేస్తూ నెల‌కు 3000 కిలోల దిగుబ‌డి సాధిస్తున్నాడు. రిటైల్ మార్కెట్‌( retile Market )తో పాటు బ‌ల్క్‌లో విక్ర‌యించి నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. మ‌రి ఆ యువ రైతు గురించి తెలుసుకోవాలంటే హ‌ర్యానా( Haryana ) వెళ్లాల్సిందే.

Vegetables Cultivation | హ‌ర్యానా( Haryana )లోని పాల్వాల్‌కు చెందిన బ‌ల‌రామ్ హ‌రిచంద్( Balram Harichand ) 2013లో బీఏ పూర్తి చేశాడు. అప్ప‌ట్నుంచి తండ్రికి వ్య‌వ‌సాయం( Agriculture )లో చేదోడువాదోడుగా ఉన్నాడు. గ‌త 45 ఏండ్ల నుంచి బ‌ల‌రామ్ కుటుంబం వ్య‌వ‌సాయం న‌మ్ముకుని జీవిస్తున్నారు. ప్ర‌ధానంగా గోధుమ‌లు, స‌జ్జ‌లు, చెరుకును పండించి విక్ర‌యించేవారు. ఇంటి అవ‌స‌రాల కోసం కూర‌గాయలు కూడా సాగు చేసేవారు.

ఏదో తెలియ‌ని అసంతృప్తి

అయితే 2006లో బ‌ల‌రామ్ నాన‌మ్మ మృతి చెందింది. దీంతో బ‌ల‌రామ్ తండ్రి కూర‌గాయ‌ల సాగును నిలిపివేశాడు. అప్ప‌ట్నుంచి కూర‌గాయ‌ల‌ను మార్కెట్‌లో కొనుగోలు చేయ‌డం ప్రారంభించారు. కానీ ఆ వెజిట‌బుల్స్ రుచిగా లేక‌పోవ‌డంతో.. ఏదో తెలియ‌ని అసంతృప్తి ఉండేది. ఈ క్ర‌మంలో 2009లో మ‌ళ్లీ తిరిగి కూర‌గాయ‌ల సాగు ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని బ‌ల‌రామ్ తెలిపాడు.

ఆవుపేడ‌, వ‌ర్మీ కంపోస్టు ఉప‌యోగించి

ఈసారి కూర‌గాయ‌ల‌ను సేంద్రీయ ప‌ద్ధ‌తుల్లోనే పండించాల‌ని బ‌ల‌రామ్ నిర్ణ‌యించుకున్నాడు. ఐకార్ అధికారుల‌ను సంప్ర‌దించి వ‌ర్మీ కంపోస్టు త‌యారీపై అవ‌గాహ‌న పెంచుకున్నారు. దీంతో ఆవుపేడ‌, వ‌ర్మీ కంపోస్టు ఉప‌యోగించి కూర‌గాయ‌ల సాగు చేశారు. ర‌సాయ‌నాల జోలికి వెళ్ల‌లేదు. ఇక ఆర్గానిక్ ప‌ద్ధతుల్లో పండించిన కూర‌గాయ‌ల‌ను కొనాల‌ని స్థానికుల‌ను అడిగిన‌ప్పుడు ఎగ‌తాళిగా మాట్లాడేవారు. కానీ కాలక్ర‌మేణా వాటి విలువ‌, రుచి తెలిసిన త‌ర్వాత‌.. ఆర్గానిక్ వెజిట‌బుల్స్‌ను కొనేందుకు క్యూ క‌ట్టారు.

తొలి ఆదివారం కేవ‌లం రూ. 750 మాత్ర‌మే సంపాదన

2014లో సేంద్రీయ ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించే ప్రాంతంలో ఆర్గానిక్ వెజిట‌బుల్స్‌ను అమ్మ‌డం మొద‌లుపెట్టాం. తొలి ఆదివారం కేవ‌లం రూ. 750 మాత్ర‌మే సంపాదించాం. త‌రువాతి వారం పాల‌కూర‌, మెంతం కూర‌, క్యారెట్‌తో పాటు ఇత‌ర కూర‌గాయ‌ల‌ను విక్ర‌యించాం. అప్పుడు ఆదాయం రూ. 3 వేల వ‌ర‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. వారి కూర‌గాయల కోసం ఆర్డ‌ర్లు రావ‌డం మొద‌లైంద‌ని బ‌ల‌రామ్ తెలిపాడు.

1.5 ఎక‌రాల నుంచి 6 ఎక‌రాల‌కు విస్త‌ర‌ణ‌

మొద‌ట కేవ‌లం 1.5 ఎక‌రాల్లోనే కూర‌గాయ‌లు పండించేవారు. 2017 నాటికి 2.5 ఎక‌రాల‌కు విస్త‌రించారు. 2019లో కూర‌గాయ‌ల సాగు ఐదు ఎక‌రాల‌కు చేరుకుంది. 2021 నాటికి ఆరు ఎక‌రాలు.. అలా ఏడాదికి ఏడాదికి త‌మ సాగును విస్త‌రించారు. ఇక ఎక‌రం పొలాన్ని మామిడి, ద్రాక్ష‌, బొప్పాయి, జామ వంటి 27 ర‌కాల పండ్ల‌కు కేటాయించారు.

నెల‌కు 3 వేల కిలోల కూర‌గాయ‌లు విక్ర‌యిస్తూ.. 2 ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయం

ఫ‌రీదాబాద్‌లోని రిటైల్ మార్కెట్‌, స్టాళ్ల ద్వారా వారానికి 200 నుంచి 250 కిలోల కూర‌గాయ‌ల‌ను విక్ర‌యిస్తున్నాడు బ‌ల‌రామ్. నెల‌కు 800 నుంచి 900 కిలోల చొప్పున విక్ర‌యిస్తున్నాడు. రిటైల్ మార్కెట్‌లో కిలో కూర‌గాయ‌ల‌ను రూ. 70 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. బ‌ల్క్ అమ్మ‌కాలైతే వారానికి 600 కిలోల వ‌ర‌కు డిమాండ్ ఉంది. నెల‌కు 2 వేల కిలోల వ‌ర‌కు బ‌ల్క్‌లో విక్ర‌యిస్తున్నారు. బ‌ల్క్ కొనుగోలుదారుల‌కు కిలోకు రూ. 40 నుంచి రూ. 50 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. మొత్తంగా నెల‌కు 3 వేల కిలోల కూర‌గాయ‌లు విక్ర‌యిస్తూ.. 2 ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు యువ రైతు బ‌ల‌రామ్.

బ‌ల‌రామ్ పండించే కూర‌గాయ‌లు ఇవే..

బంగాళాదుంప‌, క్యారెట్, వంకాయ‌లు, క్యాబేజీ, ట‌మాటా, పొట్ల‌కాయ‌లు, సొర‌కాయ‌లు, బెండ‌కాయ‌, మిర‌ప‌కాయ‌లు, దోస‌కాయ‌లు, పుచ్చ‌కాయ‌ల‌తో పాటు అన్ని ర‌కాల ఆకుకూర‌లు పండిస్తూ విక్ర‌యిస్తున్నారు.

Latest News