విధాత: అదేమి చిత్రమోగానీ సినిమా రంగంలో నిజమైన సినీ విమర్శకులకు చోటు ఉండదు. కేవలం సినీ క్రిటిక్స్‌గా కొందరు బోర్డు మెడలో వేసుకొని సందులు, గొందులు ఊరేగుతుంటారు. అలాంటి వారిలో ఉమైర్ సంధు ఒకడు. ఈయన అసలు సిసలు విశ్వరూపం మన దక్షిణాది ప్రేక్షకులు మొదటగా చవిచూసింది ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సమయంలో.
ఆప్పుడు ఈ సినిమా రివ్యూ అంటూ అద్భుతం, అత్యద్భుతం అన్నాడు. తీరా సినిమా చూస్తే మటాష్. అప్పట్నుంచి ఈ ఉమైర్ సంధుని మన తెలుగు సినీ ప్రేక్షకులు సందులు గొందులు వెతుకుతూనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన ‘వాల్తేరు వీరయ్య’ పై కూడా పడ్డాడు. రీసెంట్‌గా ‘గాడ్‌ఫాదర్’ విషయంలో కారుకూతలు కూసిన ఉమైర్.. ఈసారి కూడా మెగాస్టార్ చిరంజీవినే టార్గెట్ చేశాడు.
కొంత సేపు బాగుంది అంటాడు.. కొంతసేపు బాలేదంటాడు. దుబాయ్‌లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఈ సినీ క్రిటిక్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకుంటూ ఉంటాడు. వాల్తేరు వీరయ్య ట్రైలర్ రివ్యూ ఈయన చెప్పేశాడు. సోషల్ మీడియాలో ఉమైర్ సంధు ఈ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య ట్రైలర్ మాస్ ధమాకాలా ఉంది.
ఇది చిరంజీవి కం బ్యాక్ ఫిల్మ్ అని ఇప్పుడు చెప్పొచ్చు. అద్భుతంగా ఉంది అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. కానీ కొందరు నెటిజెన్లు మాత్రం ఆచార్య సినిమా సమయంలో ఆయన సూపర్ హిట్ రివ్యూ ఇచ్చాడు. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది. సర్దార్ గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అన్నాడు. అది బొక్క బోర్లా పడింది.
ఈయన ఇచ్చే రివ్యూలు అసలు నమ్మలేం అంటున్నారు. ఆ మధ్య కొందరు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉమైర్ సంధు గురించి మాట్లాడుతూ ఆయనో బ్లాక్ మెయిలర్ తన పేరు కోసం ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు అని తెగ తిట్టి పడేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇదే ఉమైర్ సంధు వాల్తేరు వీరయ్య గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు. అవి మెగా అభిమానులకు కోపం తెప్పించడం గమనార్హం. చిరంజీవి, శృతిహాసన్ పిక్ గురించి స్పందిస్తూ చిరంజీవి రొమాంటిక్ రోల్స్ లో నటించకుండా సీరియస్ రోల్స్ లో నటిస్తే బెటర్ అని కామెంట్లు చేశాడు.
చిరంజీవి గారిని అలాంటి పాత్రలో చూసి బోర్ కొడుతోంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి ఖాతాలో మరో డిజాస్టర్ చేరనుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అంతే కాదు, ‘చిరంజీవి అంకుల్.. మీరు ఇంకా యంగ్‌గా కనిపించేందుకు ట్రై చేయకండి.’ మీకు 70 సంవత్సరాలనే విషయాన్ని గుర్తించండి.. అంటూ బాడీ షేమింగ్ తరహాలో కొన్ని ట్వీట్స్ గుప్పించాడు.
అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం సంధుకి బుద్ధి లేదని, మైండ్ దొబ్బిందని కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి ఏమో బాగుందంటాడు. మరోసారి అస్సలు బాగాలేదంటాడు. ఏమిటిది? పబ్లిసిటీ కోసం ఉమైర్ సంధు చిరంజీవిపై విమర్శలు చేస్తున్నాడని నెటిజన్ల నుండి కామెంట్లు వినిపిస్తున్నాయి. రిలీజ్ కానీ సినిమాపై నెగటివ్ పబ్లిసిటీ చేయడం ఏంటి? అని కొందరు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Uncle #Chiranjeevi stop trying to be young! You are 70