Site icon vidhaatha

CPI ML జనశక్తి నేత.. కూర రాజన్న బెయిల్‌పై విడుదల

హైదరాబాద్‌, విధాత: పలు కేసుల్లో అరెస్ట్‌ అయి 10 నెలలుగా చంచల్‌గూడా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సీపీఐఎంఎల్‌ జనశక్తి సీనియర్‌ నాయకులు కూర రాజన్న మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు.

కోరుట్ల, కామారెడ్డి, సిరిసిల్ల, తంగేళ్లపల్లి, సిద్దిపేట ప్రాంతాలలో ఆయనపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో జరిగిన విచారణలో నాలుగు కేసుల్లో సాధారణ బెయిల్‌ మంజూరు అయింది.

ఒక కేసులో కామారెడ్డి కోర్టు కండిషన్‌ బెయిల్‌ మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో కూర రాజన్న వారానికి రెండుసార్లు పోలీస్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టి రావాలని కోర్టు కండిషన్‌ విధించింది.

75 ఏళ్లకు పైగా వయసున్న కూర రాజన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి వారసుడు, సహచరుడు, ఉస్మానియా ఇంజనీరింగ్‌ పూర్వ విద్యార్థి కూడా..

Exit mobile version