Crime News
- నేరుగా సూట్కేస్తోసహా పోలీస్‌స్టేషన్‌కు
- నిందితురాలు ఫిజియెథెరఫిస్ట్ అరెస్టు
- వాదిస్తున్నదని ఘాతుకం.. బెంగళూరులో ఘటన
విధాత: ఇటీవల చాలా మందికి అస్సలు ఓపిక ఉండటం లేదు. ఒట్టిగనే సహనం కోల్పోతున్నారు. ఆవేశానికి గురవుతున్నారు. క్షణికావేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొంటున్నారు. బంగారం లాంటి జీవితాన్ని కోల్పోతున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ క్షణికావేశంతో (ఫిజియోథెరఫిస్ట్) తన తల్లినే చంపేసింది. రోజూ తనతో వాదనలకు దిగుతున్నదని ఈ ఘాతుకానికి పాల్పడింది. తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన నేరాన్ని అంగీకరించింది. షాక్ గురైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. కేసును దర్యాప్తు జరుపుతున్నారు.
తల్లి, అత్త మధ్య రోజూ గొడవలు
39 ఏండ్ల సెనాలి సేన్ వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్. తన తల్లి బివా పాల్ (70), అత్త, భర్త, మానసిక స్థితి సరిగా లేని కొడుకుతో కలిసి బెంగళూరులో మికో లేఅవుట్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. తరచూ తల్లి బివా పాల్, అత్త మధ్య గొడవలు జరుగుతుండేవి. ఎంత సముదాయించినా ఫలితం లేకపోయింది. వారి మధ్య గొడవలు, వాగ్వాదాలు నిత్యకృత్యంగా మారాయి. సోమవారం ఉదయం కూడా అత్తకు తల్లికి మధ్య గొడవ జరిగింది.
నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానని తల్లి బెదిరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సెనాలి.. తల్లికి బివాకు ఒకేసారి బలవంతంగా 15-20 నిద్ర మాత్రలు మింగించింది. కడుపునొప్పి భరించలేక తల్లి అరవడం ప్రారంభించింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న కూతురు మరింత కోపంతో ఊగి పోతూ చున్నీతో తల్లి గొంతు నులిమి చంపేసింది. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు. అత్త మరో గదిలో ఉండటంతో ఈ హత్య విషయం ఆమెకు తెలియకుండా పోయింది.
మృతదేహాన్ని ట్రాలీ సూట్‌కేస్‌లో కుక్కి
తల్లి బివా చనిపోయిందని సెనాలి నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ట్రాలీ సూట్‌కేస్‌లో కుక్కింది. తన తండ్రి ఫొటోను కూడా సూట్‌కేసులో పెట్టింది. సూట్‌కేసుతో సహా నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. జరిగిన విషయాన్ని పోలీసులకు వెల్లడించింది. తన నేరాన్ని సెనాలి అంగీకరించింది.
సూట్‌కేసులో మృతదేహాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మృతురాలి తల్లికి, సెనాలి అత్తకు మధ్య తరచూ గొడవలు జరగడమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పశ్చిమ బెంగాల్ చెందిన సెనాలి కుటుంబం కొన్నేండ్ల క్రితమే బెంగళూరుకు వచ్చి స్థిరపడింది.