విధాత: ఢిల్లీ నుంచి వస్తిరి. దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిరి. దొరికిరి. ఇప్పుడు జైల్లోనే ఉండిరి. ఎవడో ఒకడు వచ్చి తలమాసినోడో తడిబట్టలతోని ప్రమాణం చేస్తావా? ఇంకొకడు వచ్చి పొడి బట్టలతోని ప్రమాణం చేస్తావా? ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నరు.
నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధమైన ముఖ్యమైన పదవిలో ఉన్నా. కేసు న్యాయస్థానాల్లో ఉంది. తేలుతది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేసినా అంటారు. అందుకే ఆ విషయం నేను ఎక్కువ చెప్తలేను. కానీ ఒక్కమాట చెప్తున్నా సూచనప్రాయంగా.
నిన్నమొన్న మీరు టీవీల్లో చూసింది గింతే. కానీ దొరికిన దొంగ ఇంత ఉన్నది. ఢిల్లీ పీఠమే దుమ్ము దుమ్ము రేగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో అవన్నీ బయట పడుతాయి. ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో పీకేసి, బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదు. భారతదేశానికి నిష్కృతి లేదు.
ఈ మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, ఈ పిచ్చి వ్యక్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులు, ప్రజాస్వామికంగా గెలిచిన ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా కూలగొట్టే దుర్మార్గులను తన్ని తరిమేయక పోతే, సాగ నంపకపోతే ఈ దేశం బాగుపడదు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. అని కేసీఆర్ సభలో పేర్కొన్నారు.