విధాత, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా చిట్యాల గ్రామంలో ఆర్మీ జవాన్ విగ్రహాన్ని కూల్చివేశారు. దీంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన సిద్దరాములు ఆర్మీలో పనిచేస్తుండగా 1997లో అస్సాం బాంబు పేలుడులో మృతిచెందారు.
అయితే మూడు రోజుల క్రితం అతని కుటుంబ సభ్యులు సిద్దరాములు విగ్రహాన్ని రాత్రికి రాత్రికి ప్రతిష్టించినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. తమ గద్దెపై ప్రతిష్టించారని టీడీపీ వారు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.
విషయాన్ని తాడ్వాయి పోలీసులకు, తహసీల్దార్ ల దృష్టికి తీసుకెళ్లగా ఇరు వర్గాలతో అధికారులు సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఇదే సమయంలో విగ్రహాన్ని కింద పడేసినట్లు గురువారం ఉదయం గుర్తించారు. దీంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.