రాజ్యాంగంతోనే పేదలు, దళితుల అభివృద్ధి: ఎంపీ కోమటిరెడ్డి

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: రాజ్యాంగం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముందుచూపుతో రచించిన రాజ్యాంగం అమలుతోనే దేశంలో పేదలు దళితుల అభివృద్ధి కొనసాగుతుందని మాజీమంత్రి, ఎంపీ ,కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నార్కెట్ పల్లి మండలంలో షాపల్లి, పోతినేనిపల్లి గ్రామాల్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి కాకముందుకే […]

  • Publish Date - December 6, 2022 / 10:29 AM IST

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: రాజ్యాంగం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముందుచూపుతో రచించిన రాజ్యాంగం అమలుతోనే దేశంలో పేదలు దళితుల అభివృద్ధి కొనసాగుతుందని మాజీమంత్రి, ఎంపీ ,కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నార్కెట్ పల్లి మండలంలో షాపల్లి, పోతినేనిపల్లి గ్రామాల్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి కాకముందుకే భారత రాజ్యాంగాన్ని రచించారని, ఆయన ముందు చూపుతో దళితులు, పేదవాళ్లకు రిజర్వేషన్ కల్పించారు కాబట్టే పెత్తందారి వ్యవస్థ పోయిందన్నారు.

ఇప్పుడు కొందరు నాయకులు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని, కానీ రాజ్యాంగాన్ని ఇంకా పటిష్టంగా అమలు చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు పేదవాళ్లకు పూర్తి న్యాయం జరిగినప్పుడే రాజ్యాంగంలో మార్పులపై ఆలోచించ వచ్చన్నారు. ప్రతి దళితుడు సొంత ఇంట్లో ఉండి, చదువుకున్న వారికి ఉద్యోగం కల్పించినప్పుడే అంబేద్కర్ కి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు.

అంబెద్కర్ ఆశయాలకు సాధనకు ఇప్పుడున్న ప్రభుత్వాలు, నాయకులు కృషి చేయాలన్నారు. అంబేద్కర్ బాగా ఆలోచించి రిజర్వేషన్ల అందరికీ అందే విధంగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఎస్టి ,ఎస్సి ,మైనారిటీ, వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల నెరవేరాలంటే, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు సొంత ఇల్లు కట్టుకొని ఉద్యోగాలు సాధించి ఉన్నంత స్థాయిలో ఉన్నప్పుడే నెరవేరుతాయన్నారు. కొందరు రాజకీయ నాయకులు తన సొంత ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారని, అది తప్పుడు ఆలోచన అన్నారు.